ఇటీవలే రామ్ చరణ్ కు కూతురు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పాల్సిన పని లేదు.ఆయనకు బిడ్డ పుట్టినప్పటి నుండి సందడి మాములుగా లేదు.ఇక ఇదే వారంలో మరో డబల్ ట్రీట్ అందబోతుంది అని తెలుస్తుంది.ఈ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.మరి ఈ సినిమా నుండి జూన్ 24న అంటే ఈ రోజు సాయంత్రం టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ విషయాన్నీ ఇప్పటికే అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఇదే బిగ్ ట్రీట్ అంటే పవర్ స్టార్ నుండి కూడా మరో ట్రీట్ ఫ్యాన్స్ కు అందబోతుంది అని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.మెగా హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక జులై 28న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా వరుస ప్రమోషన్స్ చేస్తూనే ఉంది.ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించింది.ఇప్పుడు ఈ సినిమా నుండి కూడా టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.బ్రో సినిమా టీజర్ కూడా రెండు మూడు రోజుల్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉందట.