Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఈ వారం నామినేషన్స్ టాస్క్ వాడీవేడీగా సాగింది. ఎవ్వరూ తగ్గలే. ఒకరికి మించి మరొకరు రెచ్చిపోయారు. ఈ మధ్య కాలంలో ఇనాయ సుల్తానా వేసిన స్టెప్స్ అన్నీ గందరగోళంగానే ఉన్నాయి. తొలి రెండు వారాలు టాప్ 2లో నిలిచిన ఈ అమ్మడు ఆ తర్వాతి వారాల్లో సూర్యతో నడిపిన వ్యవహారంతో పాతాళానికి పడిపోయింది. ఈ విషయాన్ని హైపర్ ఆది వచ్చినప్పుడు ఆమెకు చెప్పడంతో తమను తాము మార్చుకున్నట్టు హౌస్‌మేట్స్ ముందు కలరింగ్ ఇద్దాం అన్నట్టుగా చెప్పింది. మరి ప్రేక్షకులకు ఈ విషయం తెలియకుండా ఉంటుందా?
ఆ తర్వాత సూర్యను నామినేట్ చేసి ఇనాయ ఈజ్ బ్యాక్ అనిపించింది. అంతలోనే సూర్యను టాప్ 5లోకి రానివ్వకూడదని.. తాను అసలు రానివ్వనని చెబుతూ షాకిచ్చింది. పోనీ అలాగైనా ఆగిందా? తిరిగి సూర్యను హగ్ చేసుకుని అతనికి దూరంగా ఉండటం తనను చాలా బాధపెడుతోందని ఎక్కడ లేని కబుర్లు చెప్పింది. దీంతో ప్రేక్షకులు ఆమె మెంటాలిటీ అర్ధం కాక షాక్ అయ్యారు. పూటకో మాట చెబుతోందేంటిరా బాబు అని ముక్కున వేలేసుకున్నారు. ఇక సూర్య ఎలిమినేట్ అయి వెళ్లిపోతుంటే ఇనాయ ఏడుపు చూసి చిరాకు పడ్డారు కూడా. సూర్యకు ఏదో అయిపోయినట్టుగా ఏడ్చేసింది.
రేవంత్.. ఇనయను నామినేట్ చేసే క్రమంలో వీరి మధ్య పెద్ద ఫైటే జరిగింది. సూర్య గురించి ఇనాయ మాట్లాడిన మాటలన్నింటినీ రేవంత్ బయటకు తీసి ఆమెకు షాక్ ఇచ్చాడు. అంతకు ముందు ఇనాయ.. ఇప్పటివరకూ సూర్య నామినేషన్‌లోకి రాలేదని.. గుద్దితే వెళ్లిపోతాడు. చాలా సేఫ్‌గా ఆడుతున్నాడని చెప్పింది. ఆ విషయాలన్నింటినీ బయటకు తీసి ఆమెను అడ్డంగా బుక్ చేశాడు రేవంత్. కానీ ఇనాయ మాత్రం వీటిని అంగీకరించ లేదు. తానలా అనలేదని.. సూర్య గురించి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదని ఫైర్ అయింది. ఇద్దరి మధ్య వార్ బీభత్సంగానే జరిగింది. అనంతరం తనను ఛీ, తూ అనేసిందని కీర్తి కుండ పగలగొట్టాడు రేవంత్.