Bigg boss 6 : బిగ్‌బాస్ హౌస్‌లో మొన్నటివరకు ఇనాయ, ఫైమా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. కానీ ఒక విషయంలో వీరిద్దరికీ మధ్య చిచ్చు రేగింది. ముఖ్యంగా సూర్య హౌస్‌లో ఉన్నంత కాలం వీరంతా కలిసి మెలిసి గేమ్ ఆడారు. సూర్య ఎలిమినేషన్ తర్వాత వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఇటీవల ఇనాయ బాత్రూంలో కూర్చొని బిగ్‌బాస్ తనను కన్ఫెషన్ రూంలోకి పిలిస్తేనే వస్తానంటూ రచ్చ చేసిన తర్వాత ఫైమా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ ఇనాయ మాత్రం అస్సలు తగ్గలేదు. తనకు ఫ్రెండ్స్ ఎవరూ లేరని తెగేసి చెప్పింది.
అంతటితో ఆగితే బాగానే ఉండేది. కానీ నిన్నటి నామినేషన్స్ ఇద్దరి మధ్య మరింత నిప్పును రాజేశాయి. ఇప్పుడు పరిస్థితి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది.ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘పాము- నిచ్చెన’ ఆట ఇచ్చాడు బిగ్‌బాస్. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. దీనిలో మరీ ముఖ్యంగా ఇనాయ, ఫైమాలే హైలైట్ అయ్యారు. ఈ గేమ్‌లో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయి మట్టితో పాము, నిచ్చెనలను కట్టారు.ఈ క్రమంలో ఇనయా, ఫైమా గొడవకు దిగినట్లు తెలుస్తోంది.
ఇనాయ మట్టితో నిచ్చెన కట్టింది. ఆ నిచ్చెన నుంచి మట్టిని తీసుకెళ్లేందుకు ఫైమా యత్నించింది. దీంతో ఫైమాను ఈడ్చి బయటకు నెట్టేసింది. ఇద్దరి మధ్య పెనుగులాట బాగానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇనాయ తప్పు చేస్తున్నావు.. చేయి విరిగిపోతుంది అంటూ రేవంత్ హెచ్చరిస్తున్నా ఇనాయ పట్టించుకునే స్థితిలో లేదు.ఫైమా చేతులను వెనక్కి లాగేందుకు యత్నించింది. ఇద్దరూ ఒకరినొకరు కింద పడేసుకుని మరీ కొట్టుకున్నారు. చివరకు ఇనాయ మట్టి తక్కువగా ఉందని ఆమెను ఫైమా గేమ్ నుంచి తొలగించింది. దీంతో ఇనాయకు ఓ రేంజ్‌లో మండినట్టుంది. ఈ హౌస్‌లోనే వరస్ట్ గేమర్ ఫైమా అంటూ కేకలేసింది.