గాడ్ ఫాదర్ సూపర్ హిట్ తో ఇప్పుడు మోహన్ రాజాకి తెలుగులో కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటి వరకు కోలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ రాజా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల దృష్టిని కూడా ఆకర్షించాడు. రీమేక్ కింగ్ అని తనకున్న బ్రాండ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. అయితే తని ఒరువన్ లాంటి ఒరిజినల్ కంటెంట్ తో కూడా మోహన్ రాజా హిట్ కొట్టి తనకి కొత్త కథలు కూడా చెప్పడం వచ్చనే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక గాడ్ ఫాదర్ సినిమా హిట్ తో ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలు అందరూ అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ లైన్ లో ధృవ సీక్వెల్ రామ్ చరణ్ హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ఉంటుందనే క్లారిటీ నిర్వాత ఎన్వీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చేసారు. ఇక అఖిల్, నాగార్జున కలిసి ఒక మల్టీ స్టారర్ లో నటించబోతున్నారు అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా కూడా మోహన్ రాజా దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మోహన్ రాజాతో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడని టాక్. అయితే రీమేక్ సబ్జెక్ట్ కాకుండా స్ట్రైట్ స్టోరీ అయితేనే చేద్దామని చెప్పినట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.
అయితే మోహన్ రాజా మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ మెగా హీరో అయిన రామ్ చరణ్ తో చేయాలని అనుకుంటున్నారు. ధృవ సీక్వెల్ సబ్జెక్ట్ ఇప్పటికే రెడీ చేసుకున్నారని టాక్. దానిని వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నట్లు బోగట్టా. ఒకే సారి తెలుగు, తమిళ్ బాషలలో ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారని టాక్. తమిళంలో జయం రవి, తెలుగులో రామ్ చరణ్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.