బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేకు చేరుతుండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సీజన్ లో విన్నర్ ఎవరో? ఫినాలే ఎపిసోడ్ కు గెస్ట్ లు ఎవరో అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.ఈ సీజన్ ఇంకో వారంలో ముగుస్తుండడంతో టాప్ 5 కంటెస్టెంట్ లుగా ఉన్న శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, షన్ను, మానస్ స్నేహితులు,సన్నిహితులు వారికి బయట నుండి మద్దతు పలుకుతున్నారు.వారి ఫాలోవర్స్ ను తము సపోర్ట్ చేస్తున్న హౌస్ మేట్స్ కు ఓటు వేయమని క్యాంపెయిన్ చేస్తున్నారు.ఈ సీజన్ లో టాప్ కంటెండర్స్ లిస్టులో ఉన్న షన్ను కోసం దీప్తి సునయన, సన్నీ కోసం రోహిణి విపరీతమైన క్యాంపెయిన్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం పోల్స్ జరుగుతున్న సరళి ప్రకారం టాప్ లో సన్నీ కొనసాగుతుండగా,రెండవ స్థానంలో షన్ను ఉన్నారు.యుట్యూబ్ లో లోకల్ మీడియా,ప్రైవేట్ సంస్థలు యాజమాన్యలు నిర్వహిస్తున్న పోల్స్ మరియు సర్వేలలో వీరిద్దరి మధ్య పోరు హోరాహోరిగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.
సరిగ్గా ఇలాంటి సమయంలో గత సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ కెమెరా ముందుకొచ్చి తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
తాజాగా కెమెరా ముందుకొచ్చిన యాంకర్ రవి ఈ సీజన్ విన్నర్ గా ఎవరో నిలిస్తారో అనే అంశంపై ఓపెన్ అయ్యారు.ఈ వీడియోలో రవి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత శ్రీరామచంద్రకు ఉందని అన్నారు.హౌస్ లో తన స్ట్రాటజిస్ వాడి ఇంటి సభ్యులతో ఓ ఆట ఆడుకున్న రవి గెస్ కరెక్ట్ అవుతుందో లేదో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సివుంది