Big Boss Vasanthi: తెలుగు బిగ్ బాస్ లో ఎలిమినేషన్స్ ఎపిసోడ్ సాగుతూనే ఉంది. ప్రతివారం ఒకరిద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వస్తూనే ఉన్నారు. ఈక్రమంలో బిగ్ బాస్ నుండి వసంతి కూడా బయటకు వచ్చేసింది. వసంతి భారీ అంచనాలతో బిగ్ బాస్ లోకి వెళ్లినా కానీ పెద్దగా ఆడకపోవడంతో.. ఆమెను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. దీంతో ఎలిమినేషన్ లో భాగంగా వసంతి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన వసంతితో యాంకర్ శివ చేసిన చిట్ చాట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ పేరుతో యాంకర్ శివ.. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే వసంతిని కూడా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఇంటర్వ్యూ ప్రారంభంలోనే శివ.. వసంతి పరువు తీశాడు. వసంతి గురించి ఇంట్రో ఇస్తూ.. ‘అందంలో బుట్ట బొమ్మ.. ఆటలో ఉత్తబొమ్మ’ అని సంబోధించడంతోనే శివ తనదైన మార్క్ సెటైర్ వేశాడు. పలు ప్రశ్నలతో వసంతి పరువు తీసిన శివ.. ఆమెను బాగా ఆడుకున్నాడనే చెప్పాలి.
బిగ్ బాస్ లో బాగా ఆడతాను, అల్లరి చేస్తాను అని చెప్పి.. వెళ్లిన తర్వాత మాత్రం ఏమీ చేయకుండా ఉన్నారంటూ వసంతిని శివ ప్రశ్నించాడు. దీంతో వసంతి.. బిగ్ బాస్ కు ఏం కావాలో అన్నీ చేశానని సమాధానమిచ్చింది. అలాగే నామినేషన్లు ఉన్నప్పుడు మినహా ఇంకెప్పుడు ఎందుకు ఫైర్ మీద ఉండవు అని యాంకర్ శివ వసంతిని ప్రశ్నించాడు. దీనికి నేను బాగానే ఉన్నానన్నట్లు సమాధానమిచ్చింది.
Big Boss Vasanthi:
బిగ్ బాస్ నుండి బయటకు రావడానికి కారణం ఏంటని యాంకర్ శివ ప్రశ్నిస్తే.. తనకు ఎవరి సపోర్ట్ లేదని వసంతి సమాధానమిచ్చింది. బిగ్ బాస్ లో ఎవరికి ఎవరి సపోర్ట్ ఉందని వసంతిని శివ ప్రశ్నించగా.. శ్రీహాన్, శ్రీసత్యలు కలిసి గేమ్ ఆడుతున్నారని చెప్పింది. బిగ్ బాస్ లో ఇన్ని రోజులు ఉంటానని అనుకున్నావా అని శివ అడగగా.. ఇంకొన్ని రోజులు ఉంటానని అనుకున్నానని అదిరిపోయే సమాధానమిచ్చింది వసంతి. బిగ్ బాస్ హౌజ్ లో రెడీ అయి కూర్చోవడం తప్పితే పెద్దగా గేమ్ ఆడిందేమీ లేదని శివ అనగా.. నేను గేమ్ ఆడాను కాబట్టే అన్ని రోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉండగలిగాను అని చెప్పింది.