Big Boss Telugu: బిగ్ బాస్ లో ఈసారి టాప్ కంటెస్టెంట్ ఎవరో, టైటిల్ రేసులో ఎవరు ముందున్నారనే విషయం మీద దాదాపు క్లారిటీ వచ్చినట్లైంది. ఈవారం బిగ్ బాస్ హౌజ్ లోని డిజర్వ్, అన్ డిజర్వ్ సభ్యులను నిర్ణయించడం ద్వారా మోస్ట్ డిజర్వ్ సభ్యులు ఈసారి టైటిల్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరు డిజర్ల్ సభ్యులు అయ్యారు? ఎవరు అన్ డిజర్వ్ సభ్యులు అయ్యారో తెలుసుకుందాం.
డిజర్వ్, అన్ డిజర్వ్ సభ్యలను నిర్ణయించడానికి అక్కినేని నాగార్జున.. బిగ్ బాస్ హౌజ్ లోని సభ్యులు ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూంకి పిలిచి ఇతర సభ్యుల పేర్లను చెప్పమని కోరాడు. ఇందులో హౌజ్ మేట్ల ఓటింగ్ ఆధారంగా నలుగురు కంటెస్టెంట్లు డిజర్వ్ జాబితాలో ఉన్నారు. ఇందులో టాప్ లో శ్రీహాన్ ఉండగా, అతడితో పాటు గీతు, సూర్య, రేవంత్ లు ఉన్నారు. ఇక అన్ డిజర్వ్ లో మెరీనా, అర్జున్, వాసంతి, రాజ్ లు ఉన్నారు. ఇక హౌజ్ లోని 8 మందికి మాత్రం ఏ ఓటు పడలేదు.
కన్ఫెషన్ రూంలో ఎవరెవరు, ఎవరి పేర్లు చెప్పారో చూద్దాం.
శ్రీహాన్ – డిజర్వ్ హౌస్‌మెట్‌గా గీతుని, అన్ డిజర్వ్ హౌజ్ మేట్ గా రోహిత్ పేర్లను చెప్పాడు
మెరీనా – డిజర్వ్ హౌస్‌మెట్‌గా సూర్యని, అన్ డిజర్వ్ హౌజ్ మేట్ గా రాజా పేర్లను చెప్పింది.
గీతు – డిజర్వ్ హౌజ్ మేట్ గా శ్రీహాన్ ని, అన్ డిజర్వ్ హౌజ్ మేట్ గా మెరీనా పేర్లను చెప్పింది.
రేవంత్ – డిజర్వ్ హౌస్‌మెట్‌గా శ్రీహాన్ ని, అన్ డిజర్వ్ హౌజ్ మేట్ గా మెరీనా పేర్లను చెప్పాడు
శ్రీసత్య -మెరీనా వేస్ట్ అన్ డిజెర్వ్ హౌజ్ మేట్ అని చెప్పింది
పైమా – డిజర్వ్ హౌస్‌మెట్‌గా బాలాదిత్య పేరుని, అన్ డిజర్వ్ హౌజ్ మేట్ గా అర్జున్ పేరుని చెప్పింది
రాజ్ – డిజర్వ్ హౌస్‌మెట్‌గా శ్రీహాన్ పేరుని చెప్పాడు
సూర్య – డిజర్వ్ హౌస్‌మెట్‌గా గీతు పేరుని, అన్ డిజర్వ్ హౌజ్ మేట్ గా వాసంతి పేరుని చెప్పాడు
వాసంతి – రాజ్ అన్ డిజర్వ్ అని, సూర్య డిజర్వ్ హౌజ్ మేట్ అంది.
బాలాదిత్య – మెరీనా అన్ డిజర్వ్ హౌజ్ మేట్ అని, శ్రీహాన్ డిజెర్వ్ హౌజ్ మేట్ అని చెప్పాడు
Big Boss Telugu:
అర్జున్ – మెరీనా అన్ డిజెర్వ్ అని, శ్రీహాన్ డిజర్వ్ కంటెస్టెంట్ అని అన్నాడు
ఇనయ – మెరినా అన్ డిజర్వ్ అని, శ్రీహాన్ డిజర్వ్ హౌజ్ మేట్ అని చెప్పింది
ఆది రెడ్డి – అర్జున్ ని అన్ డిజర్వ్ అని, శ్రీహాన్ డిజర్వ్ హౌజ్ మేట్ అని చెప్పాడు