Big Boss Srihan: బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా అలరించిన సిరి గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో తన లవర్ అంటూ శ్రీహన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు సీజన్ 6లో శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చాడు. అవకాశం ఉన్నప్పుడల్లా తన లవర్ సిరి గురించి అతను చెబుతూ ఉంటాడు. బిగ్ బాస్ ఇంట్లో నుంచి లెటర్ కూడా రాసి.. బయటికొచ్చాక పెళ్లి చేసుకుందాం అని కూడా చెప్పాడు. అయితే ఇటీవల అతను హౌస్‌లో శ్రీసత్యతో క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తమ ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని వారు చెప్పినప్పటికీ ప్రేక్షకులు ఏదో ఊహించుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఓ ప్రోమో గురించి చర్చంతా నడుస్తోంది.
ప్రోమోలో కేవలం శ్రీసత్య గురించి మాత్రమే మాట్లాడటాన్ని చూపించారు. నువ్వు ఒక్క వారం ఉంటావు అంటే నా ప్రైజ్ మనీ నుంచి లక్ష కట్ చేస్తారు అన్నా కూడా నాకు ఓకే.. నువ్వు నాతో ఉంటావుగా అని చెప్పిన మాటలను చూపించారు. అయితే ఫుల్ వీడియోలో నువ్వు గానీ, రేవంత్ గానీ ఇంకో వారం నాతో ఈ హౌస్‌లో ఉంటారు అని తెలిస్తే.. నేను కచ్చితంగా అంత ఖర్చు చేస్తాను. అదేగా ఫ్రెండ్‌షిప్ అంటే అని చెప్పుకొచ్చాడు.
శ్రీహాన్ ఆల్వేస్ సపోర్ట్స్ ఫ్రెండ్‌షిప్
ప్రోమో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సిరి పోస్టు చేసి అందరికీ కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియో వల్ల ఎవరు ఏంటనేది తెలుస్తుంది. మా వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూస్తున్నారని మండిపడింది. తాను ముందు నుంచీ చెబుతూనే ఉన్నానని, మీరు ప్రోమోని చూసి నమ్మేయకండని తెలిపింది. అసలు వీడియో వచ్చాక విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీహాన్ ఆల్వేస్ సపోర్ట్స్ ఫ్రెండ్‌షిప్. లవ్ యూ కన్నా.. అంటూ కామెంట్ చేసింది.
Big Boss Srihan:
కాగా, గత సీజన్‌లతో పోలిస్తే ఈ సారి షోకు రేటింగు తగ్గిందనే విషయం తెలిసిందే. ఇంట్లో జనాలు తగ్గే కొద్దీ ఇప్పుడే కాస్త ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఈ సీజన్లో ఎప్పుడూ లేనివిధంగా ప్రైజ్ మనీలో కోతలు చాలా పెడుతున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల వరకు కోసేశారు. చివర్లో మళ్లీ సిల్వర్ సూట్‌కేస్ అంటూ మరో రూ.10 లక్షల్ని ఇంట్లోకి పంపిస్తారు. ఇలా చూసుకుంటే ఈసారి విన్నర్ అయినా పెద్దగా ఒరిగేదీ ఏమీ ఉండదనే చెప్పాలి.