Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి వారంలోనే ఇంటి సభ్యులకు బిగ్ ట్విస్ట్.. బిగ్ బాస్ సెట్ చేసినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే మొదటి వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఏడుగురిలో ఒకరు కాకుండా ఇద్దరు ఎలిమినేట్ అయ్యేలా డబల్ ఎలిమినేషన్.. తో ఇంటి సభ్యులకు షాక్ ఇవ్వటానికి..రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కారణం చూస్తే గత సీజన్ లలో హౌస్ లోకి 16 మంది సభ్యులను ముందుగా పంపించారు. కానీ ఈ ఆరో సీజన్ లో ఏకంగా 21 మందిని పంపించడం జరిగింది.

ఈ పరిణామంతో మొదటి వారమే డబల్ ఎలిమినేషన్ చేసి ఇంటిలో ఉన్న సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చి టెన్షన్ పెట్టించడానికి..షో మరింత రసవత్తరంగా మార్చడానికి షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదటివారం హౌస్ నుండి బయటకు వెళ్లి పోవడానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. రేవంత్, సుల్తానా, శ్రీ సత్య, ఆరోహి, అభినయశ్రీ, చంటి, ఫైమా..వీళ్లంతా మొదటి వారం ఇంటి నుండి బయటకు వెళ్ళటానికి నామినేట్ అయ్యారు. అయితే వీరిలో ఓటింగ్ పరంగా రేవంత్ రేసులో దూసుకుపోతూ ఉంటుండగా చివరిలో అభినయశ్రీ.. సుల్తానా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఇద్దరిలో కచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే మొదటి వారం డబల్ ఎలిమినేషన్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తూ ఉండటంతో..ప్రస్తుతానికి ఓటింగ్ పరంగా ఏడుగురిలో చివరిలో ఉన్న ఇద్దరు అభినయశ్రీ, సుల్తానా ఇంటి నుండి వెళ్లిపోయే అవకాశాలున్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు వోటింగ్ కి అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఓటింగ్ లో లెక్కలు మారతాయమో చూడాలి.