Big Boss Neha: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. కానీ కొందరు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకొని రాణిస్తుంటారు. మరోవైపు టీవీ షోల్లోనూ పాల్గొంటూ క్యాష్ చేసుకుంటూ ఉంటారు కొందరు. బిగ్ బాస్ హౌస్ మేట్ అనే ట్యాగ్ లైన్ ఉంటే ఇండస్ట్రీలో కాస్త వ్యాల్యూ పెరుగుతోందనే భావన చాలా మందిలో ఉంది. ఇందుకు అనుగుణంగానే కొందరు బిగ్ బాస్ ఫేం.. అనే తోకను తగిలించుకుంటుంటారు.
లేడీ కంటెస్టెంట్ల విషయంలో ఇది చాలా వరకు కలిసి వస్తోందని చెబుతున్నారు నిపుణులు. బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేషన్‌కు గురైనా సరే.. మార్కెట్లో మంచి గిరాకీ పట్టేస్తున్నారు చాలా మంది కంటెస్టెంట్లు. ఈ కోవలోకి చాలా మంది నటీనటులు వస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 నడుస్తోంది. షోను రక్తి కట్టించడానికి బిగ్ బాస్ చాలా ప్రయాసలు పడుతున్నాడు.
తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్‌గా వచ్చిన జిమ్నాస్టిస్ట్ అండ్ యాంకర్ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కనుందని తెలుస్తోంది. నేహా చౌదరి సినీ, క్రీడా రంగంలో తనదైన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈమె చలాకీ తనంతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. యాంకరింగ్‌పై అభిమానంతో పలు షోల్లో పాల్గొంటూ తనదైన శైలిలో కార్యకర్మాలను నడిపిస్తోంది.
Big Boss Neha: తిరుపతి అమ్మాయే..
ఏపీలోని తిరుపతికి చెందిన యువతి అయిన నేహా.. రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ ఛాంపియన్. బంగారు పతకం కూడా అందుకుంది. కొన్ని రోజులుగా నేహా వివాహం చేసుకుంటోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ సందర్భంగా నాగార్జునతో బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటానంటూ చెప్పింది ఈ అమ్మడు. ఈ మేరకు తన ఇంట్లో వాళ్లకు కూడా చెప్పేశానని తెలిపింది. ఈ నేపథ్యంలో ఐ సెడ్ ఎస్.. అంటూ యూట్యూబ్‌కు సంబంధించిన లింక్‌ని జతచేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది నేహా. ఇది గమనించాక నేహా పెళ్లి ఖాయమైందనే నిర్ధారణకు వస్తున్నారు. యూట్యూబ్ బ్లాగ్ లో నా పెళ్లి గోల మొదలైంది.. అంటూ వీడియోను కూడా చేసి తన కాబోయే వరుడిని పరిచయం చేసింది. తన ఇంజనీరింగ్ క్లాస్ మేట్ .. 13 ఏళ్ల నుంచి స్నేహితుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.