Big Boss6: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో మరోసారి ఎలిమినేషన్ కు అంతా సిద్ధమైంది. ఈ వారం ఏకంగా 13 మంది నామినేషన్ లో ఉన్నారు. ఆదిరెడ్డి, ఆదిత్య, అర్జున్ కళ్యాణ్, ఫైమా, ఇనయ, కీర్తి, మెరీనా, రాజ్, రేవంత్, రోహిత్, శ్రీహాన్, శ్రీ సత్య, వాసంతిలు నామినేషన్లో ఉన్నారు. అయితే వీరందరిలోకి ఒకరిని మాత్రమే ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ చేయనున్నారని తెలుస్తోంది.
ఈ వారం 13 మందిలో పేలవమైన గేమ్ తో, పులిహోర కలుపుతూ అందరికీ విసుగు పుట్టించిన అర్జున్ కళ్యాణ్ ఎమినేట్ అవుతారని టాక్ నడుస్తోంది. నిజానికి ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ అనుకుంటే, సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో అర్జున్ కళ్యాణ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకున్న బిగ్ బాస్ అతడిని బిగ్ బాస్ హౌజ్ నుండి పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌజ్ లోకి టైటిల్ రేసులో ఉంటాడని అనుకున్న అర్జున్ కళ్యాణ్.. శ్రీసత్య చేతికి కీలుబొమ్మగా మారిపోయాడు. ఆమె ఆడమన్నట్లు ఆడటం తప్పితే సొంతంగా ఎలాంటి గేమ్ స్ట్రాటజీ లేనట్లు తెలుస్తోంది. శ్రీసత్యకి పూర్తిగా అసిస్టెంట్ గా మారిపోయిన అర్జున్ కల్యాణ్.. బిగ్ బాస్ హిస్టరీలోనే వరుసగా రెండుసార్లు జైలుకు వెళ్లిన చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
Big Boss6:
బిగ్ బాస్ హౌజ్ లో సొంతంగా గేమ్ ఆడకపోవడం, హౌజ్ లో ఎవరి సపోర్ట్ లేకపోవడం, రెండుసార్లు వరుసగా జైలు వెళ్లిన రికార్డుకుతోడు అతిగా పులిహోర కలుపుతూ విసుగుపుట్టిస్తుండం వల్ల అర్జున్ కళ్యాణ్ ను బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక అతడి ఎలిమినేషన్ గురించి నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. ఈ పులిహోర రాజా ఇన్ని వారాలు హౌజ్ లో ఉండటమే గొప్ప అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక అర్జున్ కళ్యాణ్ జర్నీ వీడియో వేస్తే అందులో అతడి కన్నా శ్రీసత్యనే ఎక్కువ కనిపిస్తుందంటూ సెటైర్ వేస్తున్నారు.