Big Boss6: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 ఎంతో విజయవంతంగా సాగుతోంది. తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగల షోల జాబితాలో బిగ్ బాస్ సీజన్ 6 కూడా ఒకటి. ఇక బిగ్ బాస్ బాగా పాపులార్టీని సొంతం చేసుకుంటుండగా.. ఇందులో నుండి ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూనే ఉన్నారు. ఇక ఎలాంటి వివాదాలు లేకుండా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వ్యక్తిగా మెరీనా నిలిచింది.
మెరీనా బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ కాగా.. ఆమె తాజాగా బిగ్ బాస్ కెఫెలో యాంకర్ శివకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఇంటర్వ్యూలో యాంకర్ శివ మెరీనా పరువు తీసేలా ఎన్నో ప్రశ్నలు సంధించాడు. మెరీనాను రెచ్చగొట్టేలా వెకిలి నవ్వులు నవ్వాడు. కానీ మెరీనా మాత్రం యాంకర్ శివకి ఎంతో కూల్ గా సమాధానమిచ్చింది. మీరు ఎంత కోపం తెప్పించినా, నేను కోపం తెచ్చుకోను అని యాంకర్ శివకు మెరీనా కూల్ గా సమాధానం చెప్పింది.
‘జనాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు అన్న మాట హౌస్ లో నువ్వే ఎక్కువగా వాడావు. జనాలు చూసేందుకు అసలు మీరేం చేశారు?’ అని యాంకర్ శివ మెరీనాను ప్రశ్నించాడు. ఆమె మాత్రం ఎంతో కూల్ గా డీల్ చేసింది. ‘నేను నాలా ఉన్నా’ అని సమాధానమిచ్చింది. ఇంతకీ హౌస్లో మీరు గేమ్స్ ఆడారా? అని యాంకర్ శివ సూటిగా ప్రశ్నించగా.. నావరకు ఎంతయిందో అంతే ఆడానని మెరీనా సాఫ్ట్ గా జవాబిచ్చింది.
Big Boss6:
‘అయినా నువ్వూ, రోహిత్ ఏదో ట్రిప్కు వచ్చినట్లు అనిపించింది’ అని యాంకర్ శివ ప్రశ్నించగా.. ‘నేను ఆడగలుగుతానా? లేదా? అని ఎంత టెన్షన్ పడ్డానో మీకేం తెలుసు’ అని కౌంటరిచ్చింది మెరీనా. దీంతో శివ ‘నేను ఆడగలనా? లేదా? అని కూడా ఆలోచించారా?’ అని వెటకారంగా నవ్వాడు. శివ అలా చేయడంతో మెరీనా కూల్ గా ‘మీరు ఎంత కోపం తెప్పించినా నాకు కోపం రాదు’ అని మెరీనా సమాధానమిచ్చింది. దానికి శివ ‘మీ దగ్గర నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది?’ అని డైలాగ్ వేశాడు. మొత్తానికి మెరీనాను యాంకర్ శివ ఎంతలా ఇబ్బంది పెడదామనుకున్నా.. ఆమె మాత్రం ఎంతో కూల్ గా డీల్ చేసింది.