Bhumi Padnekar : రెడ్ కార్పెట్ ఫ్యాషన్ కి బాలీవుడ్ కేర్ ఆఫ్ అడ్రస్ అందులోను నలుపు రంగు దుస్తులు స్టార్స్ కు ఆల్ టైం ఫేవరెట్ అనే చెప్పాలి. ఇప్పటివరకు చాలా మంది తారలు నాలుపు రంగు దుస్తుల్లో కనిపించి రెడ్ కార్పెట్ పైన సందడి చేసారు. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కోసం బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ బ్లాక్ కలర్ శాటిన్ గౌను ను వేసుకుని తన అందాలను పరిచి కుర్రాళ్ళ మనసు దోచేసింది. థై హై స్లిట్ తో వచ్చిన ఈ కట్ అవుట్ గౌన్ లో ఎంతో హాట్ గా కనిపించింది.

Bhumi Padnekar : భూమి పెడ్నేకర్ అద్భుతమైన ఫ్యాషన్‌వాది. తన అవుట్ ఫిట్స్ తో అభిమానులను ఎలా మంత్రముగ్ధులను చేయాలో ఈ భామకు బాగా తెలుసు. ఇటీవలి జరిగిన అవార్డ్ షో కోసం,ఈ నటి బ్లాక్ శాటిన్ గౌను వేసుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఈ అవుట్ ఫిట్ తో రెడ్ కార్పెట్ పైన సందడి చేయడమే కాకుండా హాట్ ఫోటో షూట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసి ఫ్యాన్స్ హృదయాలను దోచేసింది.

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి లుక్స్ పైన ఇన్ బాక్స్ లో యూత్ క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

హాల్టర్ నెక్‌లైన్ , స్కర్ట్‌పై ఉన్న రచ్‌డ్ వివరాలు, ఆమె నడుము వైపున ఉన్న చీలిక వరకు ప్రతి డీటైల్స్ భూమి అందాలని మరింత ఎలివేట్ చేస్తున్నాయి.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా చేతికి గోల్డెన్ బ్యాంగిల్స్ , చెవులకు చంకీ గోల్డెన్ చెవిపోగులు పెట్టుకుంది. మధ్య పాపిట తీసి తన హెయిర్ ను లూస్ గా వదులుకుంది. కనులకు వింగెడ్ ఐ లైనర్ , మస్కారా దిద్దుకుని పేదలకు గ్లాసి పింక్ లిప్ షేడ్ పెట్టుకుని అదరగొట్టింది.
