Bhoomi Padneker : బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ ఇంకా దీపావళి పండుగ నుంచి బయటికిరాలేదు.. ఇంకా ఫెస్టివల్ లైట్స్ మూడ్‌లోనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఈ చిన్నది అద్భుతమైన లెహెంగా సెట్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను నెట్టింట్లో పోస్ట్ చేసింది. దీపపు వెలుగుల్లో పసుపు రంగు లెహెంగాలో ఎంతో అందంగా కనిపించింది భూమి. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.

Bhoomi Padneker : భూమీ పడ్నేకర్ ఫ్యాషన్ డైరీస్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ విషయంలో భూమి ఎప్పుడూ ఫాలోవర్స్‌ను నిరుత్సాహానికి గురి చేయలేదు. హాట్ హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ కూడా ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం భూమి పడ్నేకర్ ఫ్యాషన్ డిజైనర్ హౌజ్ పెర్నియాస్ పాప్ అప్ షాప్‌కు మ్యూస్‌గా వ్యవహరించింది. ఈ క్లాతింగ్ లేబుల్ కలెక్షన్స్ నుంచి బ్రైట్ పసుపు రంగు లెహెంగాను ధరించి కెమెరాలకు క్యూట్ పోజులను ఇచ్చింది. ప్లంగింగ్ నెక్‌లైన్ ,మిర్రర్ వర్క్‌తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ స్ట్రాపీ బ్లౌజ్ ను వేసుకుంది భూమి. ఈ బ్లౌజ్‌కు మ్యాచింగ్‌గా సిల్వర్ మిర్రర్ వర్క్ డీటైల్స్ తో వచ్చిన పొడవాటి ఫ్లోయీ స్కర్ట్‌ను ధరించింది. ఈ లెహెంగా స్కర్ట్, బ్లౌజ్ కు జోడీగా వేసుకున్న సిల్క దుపట్టా తన లుక్‌కు మరింత ఫెస్టివ్ వైబ్స్‌ను తీసుకువచ్చింది.

పెర్నియాస్ పాప్ అప్ షాప్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకన్న స్టేట్మెంట్ గోల్డెన్ ఇయర్ రింగ్స్‌ను చెవులకు అలంకరించుకుంది. అజోటిక్ జ్యువెల్లరీ షెల్ఫ్ నుంచి బంగారు గాజులను ఎంపిక చేసుకుని చేతులకు అలంకరించుకుంది.

ఈ మధ్యనే భూమి పడ్నేకర్ అద్భుతమైన డిజైనర్ లెహెంగా వేసుకుని అదరిపోయే ఫోటో షూట్‌ను చేసింది. తెల్లటి లెహెంగా సెట్‌లో దేవకన్యలా మెరిసింది ఈ బ్యూటీ. ఫ్యాషన్ డిజైనర్ అనుశ్రీ రెడ్డి షెల్ఫ్ నుంచి ఈ స్టన్నింగ్ లెహెంగాను ఎన్నుకుంది భూమి. సిల్వర్ సీక్విన్స్‌తో , ఎంబ్రాయిడరీ డీటైల్స్‌తో వచ్చిన ఈ లెహెంగా లో భూమి అందాలు రెట్టింపయ్యాయి. దివి నుంచి దిగి వచ్చిన రంభలా మెరిసిపోయింది భూమి.

ఈ వైట్ లెహెంగా సెట్‌కు మ్యాచింగ్‌గా వైట్ స్టోన్స్ , ఎమెరాల్డ్స్ తో పొదిగిన నెక్‌లెస్‌ను వేసుకుంది. ఈ నెక్‌లెస్‌ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా జ్యువెల్లరీ కలెక్షన్స్ నుంచి ఎంపిక చేసుకుంది భూమి.
