ప్రముఖ సిని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ కలిసి నటించిన తాజా సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఈరోజు విడుదలకు ముందే యూఎస్ వంటి ఓవర్సీస్ లోముందే విడుదలైంది. మరి అక్కడి రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది ట్విట్టర్ రివ్యూల ద్వారా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మరి చిరంజీవి తన స్టామినా ఎంటో మళ్లీ నిరూపించారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

భోళాశంకర్ సినిమా తమిళంలో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై అనుకున్నంత స్థాయిలో బజ్ ఏర్పడలేదు. చాలామంది సినిమాను ఇప్పటికే చూశారు కాబట్టి పెద్దగా సినిమాపై అంచనాలు లేవనే చెప్పుకొవాలి . మరొకవైపు ఈ సినిమాకు ఓటీటీ లేదని చెప్పిన చిరంజీవి.. రీమేక్ లు చేస్తే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు.వాస్తవానికి ఒకప్పుడు రీమేక్ లు చేయడంలో తప్పులేదు.. కానీ ఇప్పుడు ఓటీటీ లు వచ్చాక పైగా డబ్బింగుల్లో మన భాషల్లో విడుదలయ్యాక కూడా రీమేకులు చేస్తే అంతగా ఆసక్తి ఉండదు అనేది అభిమానుల మాట. కానీ భోళాశంకర్ సినిమాలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.