మతం మనిషిని ఓ రకమైన ఆద్యాత్మికంలోకి తీసుకెళ్తుంది. అలాగే ఉన్మాదిగా కూడా మారుస్తుంది. ఈ రెండు స్వభావాలు ఉన్నవారు అన్ని మతాలలో కూడా ఉన్నారు. అయితే మతం ఆధ్యాత్మికస్థితిలోకి తీసుకెళ్తే సన్యాసాశ్రమంలో సాదు జీవితాన్ని అలాంటి వారు గడపడానికి ఇష్టపడతారు. అయితే ఉన్మాద స్థితిలోకి తీసుకెళ్తే మతం పేరుతో మారణహోమాల సృష్టిస్తారు. అన్ని దేశాలలో ఈ మత ప్రభావం మనుషులలో ఏదో ఒక రూపంలోఉంటూనే ఉంటుంది. అయితే ఎంతో గొప్ప స్థానంకి వెళ్లి అన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయిన వారి గురించి మన కథలలో చదువుకున్నాం. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో చూస్తున్నాం.
గతంలో హాట్ హీరోయిన్, బికినీ అందాలతో కుర్రాళ్ళకి మతి పోగొట్టిన సనాఖాన్ ఒక్కసారిగా సినిమాలని వదిలేసి ఖురాన్ అర్ధం చేసుకొని పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా ధ్రువీకరించింది. తాజాగా మరో అందాల భామ అలాగే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయింది. భోజ్ పురి సినిమాలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హాట్ బ్యూటీ సహారా అఫ్షా ఉన్నట్టుండి సినిమాలు వదిలేసి ఇస్లాం మతం సూచించిన మార్గంలోకి వెళ్ళబోతున్నట్లు ప్రకటించింది.
ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా పవిత్ర ఖురాన్ సూచించినట్లు బ్రతకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. భోజ్ పురి సినిమాలు చూసేవారికి ఆమె బోల్డ్ అందాలు బాగా పరిచయం. అలాంటి హాట్ ఫోటో షూట్ లతో, బోల్డ్ అందాలతో అలరించిన హీరోయిన్ ఉన్నట్లుండి బురఖా వేసుకొని సన్యాసినిలా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.అయితే ఆమె ఈ మార్గంలోకి ఎందుకు వెళ్ళింది అనేది మాత్రం బయటకి చెప్పలేదు. ఏది ఏమైనా సనాఖాన్ తర్వాత అదే తరహాలో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిన స్టార్ హీరోయిన్ గా సహారా అఫ్షా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కనిపిస్తుంది.