రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దీంతో ముందుగా సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలన్నీ ఇప్పుడు నిధానంగా తమ డేట్స్ ను మార్చుకుంటున్నాయి.కానీ భీమ్లా నాయక్ మాత్రం ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కే కట్టుబడి ఉందని సమాచారం.
పవన్ కళ్యాణ్,రానా కలిసి నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పాటలు,ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.