సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ప్రేక్షకులు ముందుకు రావాల్సివుంది కానీ అదే సమయంలో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుంది.దీంతో ఆర్.ఆర్.ఆర్ మేకర్స్,రాజమౌళి దిల్ రాజు అధ్యక్షుడిగా ఉన్న యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ ను కన్విన్స్ చేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.అయితే తాజాగా వీరి ప్రయత్నం ఫలించిందని ఫిల్మ్ సర్కిల్స్ ప్రచారం జరుగుతుంది.
వెనకడుగు వేయకుండా ముందు అనుకున్న డేట్ కే మూవీని రిలీజ్ చేయాలని భావించిన ఈ మూవీ ప్రొడ్యూసర్ సూర్య దేవరనాగవంశీ అన్ని వైపుల నుండి ప్రెషర్ రావడం వల్లనే ఆయన వెనక్కి తగ్గరని ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.