సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న మూవీ భీమ్లా నాయక్.ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్,రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ముందుగా సంక్రాంతికి రిలీజ్ కావల్సివుంది.కానీ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్,రాజమౌళి తదితరులు అభ్యర్ధన మేరకు మూవీ రిలీజ్ ను ఫిబ్రవరికి మార్చుకున్నారు.ఈ మూవీ నుండి ఈరోజు ఉదయం 11 గంటలకు చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ను విడుదల చేస్తుంది.
ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని డిజే సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతున్నారు.ఈ సాంగ్ కోసం సినీ అభిమానులు మరియు పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.