నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `భగవత్ కేసరి` అనే టైటిల్ పెట్టినట్టు రెండ్రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే ఖరారు చేశారు. ఐ డోంట్ కేర్ అనేది ఉపశీర్షిక. శనివారం బాలయ్య బర్త్ డే. ఈ సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్‌ని సైతం విడుదల చేశారు. చేతిలో ఆయుధం.. తీక్షణమైన చూపులతో బాలయ్య లుక్ చూడగానే ఆకట్టుకొంది.
జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా… రెండు రోజుల ముందు టైటిల్ రివీల్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 108 లొకేషన్లలో టైటిల్ అనౌన్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేశారు.

‘భగవత్ కేసరి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
బాలయ్య కోసం అనిల్ రావిపూడి ఓ కొత్త కథ రాసుకొన్నాడనిపిస్తోంది. అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దసరాకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. బాలయ్య నటించే 108వ సినిమా ఇది. 109వ చిత్రానికి బాలయ్య పుట్టిన రోజున క్లాప్ కొడతారు. బాబీ దీనికి దర్శకుడు.
బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన కూడా రానుంది. ఆయన హీరోగా ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి హిట్ కొట్టిన కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమాను జూన్ 10న ప్రకటించనున్నారని తెలిసింది. అనిల్ రావిపూడి సినిమా పూర్తయ్యాక ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.