BF.7: హమ్మయ్య కరోనా మహమ్మారి పీడ వదిలింది. ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకునే లోపే కొత్త కొత్త వైరస్ లు రోజురోజుకు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి వైరస్ లు చాలానే వచ్చాయి ఇక మనకి ఏమి అవ్వదులే అని అనుకునే వారికి హెచ్చరికలు జారీ చేస్తోంది చైనా. చాప కింద నీరు లాగా వ్యాప్తి చెందుతోంది ఒమిక్రమ్ కొత్త వేరియేట్ బీఎఫ్ 7.

ఇప్పటికి చైనాలో ఈ వేరియంట్ వాయువేగంతో వ్యాపిస్తోంది భారత్లోడు కొత్త వేరియేట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్ లో మూడు కేసులు నమోదు కాగా రెండు గుజరాత్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ కు రీ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

BF.7: కోవిడ్ 19 కి కేంద్రబిందువైన చైనాలోనే మరో కొత్త వీరియట్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ కు బిఎఫ్ 7 కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కొత్త వైరస్ మరో ఉగ్రరూపం దాల్చుతుందని వార్తలు వస్తున్నాయి. వాయువేగంగా ఇది వ్యాపిస్తుందని హెచ్చరికలు వస్తున్నాయి. అయితే భారత్ లో మూడు కేసు లు నమోదు అయినప్పటికీ దీని తీవ్రత అంత ఎక్కువగా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. అయినా ఈ వేరియంట్ యొక్క గుణగణాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జీ నోమ్ సీక్వెనింగ్ పై దృష్టి పెట్టాలని సూచించింది.

ప్రస్తుతం చైనాలో తీవ్ర ఆందోళన నెలకుంటుంది. బీజింగ్ నగరంలో బీఎఫ్ 7 వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వేరియెంట్ కు అత్యంత బలమైన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం కూడా ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉందట. చైనా నుండి మొదలుకొని అమెరికా బ్రిటన్ బెల్జియం జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఈ వేరియెంట్ జాడలు కనిపిస్తున్నాయి. నేపథ్యంలో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియెంట్ పై ఆందోళన మొదలైంది.