వర్షాకాలం వచ్చిందంటే మొక్కజొన్న పొత్తులు ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. ఈ కాలంలో వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే మొక్కజొన్న పోత్తులని ఉడకబెట్టి వీధి వీధి తిప్పుతూ అమ్మేవారు ఎక్కువగా ఉంటారు. అలాగే పార్క్ ల వద్ద, విహారప్రాంతాలలో కూడా వీటిని విరివిగా అమ్ముతూ ఉంటారు. జనం కూడా చాలా ఇష్టంగా కొనుక్కొని తింటారు. ఈ మొక్కజొన్న పొత్తులు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఈ నేపధ్యంలో వీటిని తినడానికి అందరూ ఇష్టపడతారు. వీటిలో మరీ ముఖ్యంగా స్వీట్ కార్న్ అయితే ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. థియేటర్స్ లో కూడా ఉడికించిన జొన్న గింజలని అమ్ముతారు. అలాగే ఇళ్ళల్లో కూడా జొన్న పొత్తులు కొనుక్కొని ఉడకబెట్టి తింటారు.
అలాగే నిప్పులపై కాల్చిన జొన్నపొత్తులు కూడా బయట అమ్ముతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ జొన్న పొత్తులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పచ్చి మొక్కజొన్న పొత్తులు చాలా మంది తింటారు. అయతే ఇలా తినడం వలన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చి జొన్న తినేటపుడు సరిగా నమలకపోయిన, సరిగా శుభ్రం చేయకుండా తిన్న చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్ముఖ్యంగా చిన్నారులలో జీర్ణం సంబందిత సమస్యలు తలెత్తుతాయి.
అలాగే కడుపునొప్పి, అల్సర్, గ్యాస్ ట్రబుల్, విరోచనాల వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయేరియా బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఎట్టి పరిస్థితిలో మొక్కజొన్నని భాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి అలా తినడం వలన అందులో ఉన్న పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయి. అలాగే జొన్నలో ఉండే ఫైబర్ షుగర్ బారిన పడేవారికి ఎతో మేలు చేస్తుంది. సరిగా శుభ్రం చేయని, పచ్చి మొక్కజొన్నపై కంటికి కనిపించని బాక్టీరియాలు నేరుగా శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. ఏది ఏమైనా వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు తినడం ఎంత శ్రేయస్కరమో, జాగ్రత్త లేకుండే అదే స్థాయిలో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తుంది.