Belly Fat: కరోనా వల్ల చాలా మంది లైఫ్ స్టైల్ మారిపోయింది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇంటిదగ్గరే కదలకుండా ఒకే చోట కూర్చొని పని చేస్తున్నారు. ఇలా చేయడంతో అనేక అనారోగ్య సమస్యలు తెలెత్తుతున్నాయి. అందులో గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల వచ్చే ప్రధాన సమస్య పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోవడం. కనీసం తినడానికి కూడా లేవకుండా అక్కడే కూర్చొని ముగించేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
కనీసం ఒక గంట అయినా లేచి తిరగడం అలవాటు చేసుకోండి. భోజనం చేసిన తర్వాత ఇంట్లోనే అటు ఇటు తిరగడానికి ప్రయత్నించండి. కొంచం విశ్రాంతి తీసుకోండి. ఇలా చేస్తే ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అలాగే ప్రతి రోజు తప్పకుండా వ్యాయామం చేయడం మాత్రం మరువకండి. ఇలా చేస్తే మీరు కూర్చొని పని చేసినా కూడా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా సహాయపడుతుంది.
ఇలాగే కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్టలోని కొవ్వు కరగడానికి వీలు అవుతుంది. అవేమిటో తెలుసుకుందాం. చేపలను ఎక్కువగా తినాలి మరియు గుడ్డులోని పచ్చ సొనను తీసుకుంటే పొట్టలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అదే విధంగా ప్రతి రోజు మొలకెత్తిన తీసుకోవాలి. ఈ మొలకెత్తిన ఆహారంలో కూడా కొవ్వుని కరిగించే శక్తి ఉంటుంది.
Belly Fat:
ఇంకా మనం గుర్తు పెట్టుకోవలిసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏది తిన్నా మితంగానే తినాలి. చేపలు, గుడ్లు తినమన్నారు కదా అధిక మోతాదులో తీసుకుంటే కూడా మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీ పొట్ట దగ్గర కొవ్వు పేరకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.