పుష్ప సినిమాలోని సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ సమంతని మరో రేంజ్ కి తీసుకుపోయింది. ఆ సాంగ్ ముందు వరకు ఐటెం సాంగ్స్ అంటే అందులో నటించిన నటి ఎక్స్ పోజింగ్, డాన్స్ ఉంటే చాలని అనుకునేవారు. అయితే ఊ అంటావా సాంగ్ లో సమంత పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సాంగ్స్ అంటే ఇలా ఉండాలి అని మాట్లాడుకునేలా సుకుమార్ చేసాడు. సాంగ్ లో ప్రతి లైన్ లో వచ్చే మీనింగ్ కి తగ్గట్లుగానే సమంత ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ఆ పాటని ఇండియన్ వైడ్ గా ఫేమస్ చేసేశాయి. అంతలా జనాలలోకి వెళ్ళిపోయిన సాంగ్ కోసం సుకుమార్, బన్నీ చాలా మంది పేర్లు పరిశీలించినట్లు తెలుస్తుంది.
ఫైనల్ గా దిశా పటానిని కూడా ఫిక్స్ చేశారు. ఆమె అయితే పెర్ఫెక్ట్ గా ఉంటుందని పాన్ ఇండియా రేంజ్ లో రీచ్ అవుతుందని భావించారు. అయితే తెలుగులో ఉన్న హీరోయిన్స్ లో ఎవరినైనా ట్రై చేస్తే బాగుంటుందని అల్లు అర్జున్ సుకుమార్ కి సలహా ఇచ్చినట్లు సమాచారం. బన్నీ సలహాతో తెలుగు హీరోయిన్స్ ని పరిశీలించినపుడు సమంత సుకుమార్ కి కనెక్ట్ అయ్యింది. అయితే ఆమె అదే సమయంలో విడాకులు తీసుకుంది.
దాంతో కొంత బాధలో ఉంటుందని సుకుమార్ టీమ్ భావించారు. ఏదో ఒకటి అవుతుందని సమంతతో సుకుమార్ మాట్లాడారు. అయితే ముందు ఆమె పాట చేయడానికి అంగీకరించలేదంట. తరువాత బన్నీ కాల్ చేసి ఒప్పించడంతో సమంత ఒకే చెప్పింది. ఈ సాంగ్ చిత్రీకరణ కూడా కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేశారు. ఇక రిలీజ్ తర్వాత సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. సమంత ఇమేజ్ ని కూడా ఈ సాంగ్ అమాంతం పెంచేసింది.