Beauty Tips: చలికాలం వచ్చేసింది. వస్తూ వస్తూ ఎముకలు కొరికే చలి కూడా తెచ్చేసింది. కాళ్లు,చేతులూ పగలడంతో అందరూ క్రీములు,లోషన్ లు వాడే పనిలో ఉన్నారు. చర్మాన్ని కాపాడుకోవడం అంత సులువైన పని కాదు అలాగని మరీ కష్టతరం కూడా కాదు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు చర్మం మృదువుగా ఉంటుంది. రోజుల తరబడి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నియమాలు పాటించగలిగితే మంచి చర్మం మీదయినట్లే.
చర్మం అందంగా అలాగే మృదువుగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..
రాత్రిపూట మేకప్ ఎట్టిపరిస్థితుల్లో ఉంచకూడదు. రాత్రి పడుకునే ముందే మేకప్ తీసేయాలి. ఎక్కువ సేపు మేకప్ ఉండటం వల్ల మచ్చలు ఏర్పడతాయి అని తెలిసిన సంగతే. అలా జరగకుండా ఉండాలంటే రాత్రే మేకప్ తొలగించాలి.మేకప్ తీసిన తరువాత మేలు రకం ఫేస్ వాష్ తో మంచిగా ముఖాన్ని శుభ్రపరచాలి.క్లెన్సర్ ని ఉపయోగించినా పరవాలేదు.
చర్మం మీద డెడ్ సెల్స్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిసిందే.అందుకని ఈ సెల్స్ ని తొలగించాలి.మృతకణాలు పోతే ముఖం కాంతివంతంగా అవుతుంది.ఫేస్ స్క్రబ్ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. వారానికి రెండు సార్లు ఫేస్ స్క్రబ్ వడగలిగితే మంచి గుణం కనపడుతుంది.వీటితో పాటుగా మంచి క్వాలిటీ టోనర్ ని కూడా వాడాలి. ముఖం మీద పేరుకుపోయిన మురికిని తొలగించడానికి టోనర్ సహాయం చేస్తుంది.
Beauty Tips:
చర్మంలో జీవం ఉంచడానికి తేమ అవసరం. ఈ తేమ కోసం హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ని ఉపయోగించాలి.మాయిశ్చరైజర్ తో పాటుగా సీరమ్‌ను కూడా వాడితే మంచి ప్రభావం ఉంటుంది. వీటన్నిటికీతోడు ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా కావాలి. కాబట్టి మంచి ఆహారం తీసుకుని,వేళకి వ్యాయామం చేయాలి. తరచుగా నీరు కూడా తాగాలి.మంచి ఆహారం అంటే తాజా కూరగాయలు,పండ్లు,ఆకుకూరలు తీసుకోవాలి. ఏదైనా మంచి ఆరోగ్యం ముఖ్యం. ఈ చిట్కాలు పాటిస్తే మంచి చర్మం మీ సొంతం అవుతుంది