యు.ఏ.ఈ వేదికగా భారత్ నిర్వహిస్తున్న టి 20 వరల్డ్ కప్ తాజాగా ప్రారంభం అయ్యింది.ఈ నెల 24న భారత్ మరియు పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనున్నది.సరిగ్గా ఇలాంటి సమయంలో ఇరు దేశాల సీనియర్స్ గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.సరిగ్గా ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కొందరు పాకిస్తాన్ టెర్రరిజాన్ని మానుకునే దాకా భారత్ పాకిస్తాన్ ఎలాంటి గేమ్ ను ఆడకూడదు.బిసిసిఐ టి 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ ను రద్దు చేసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ బిసిసిఐ పై ఒత్తిడి చేస్తున్నారు.
భారత్ ఇప్పటికే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సీరీస్ లను ఆడడం మానేసింది.దీంతో ఆర్థికంగా పిసిబి చాలా కష్టాలలో పడింది.ఇప్పుడు ఐసిసి టోర్నమెంట్స్ లో కూడా భారత్ పాకిస్తాన్ తో ఆడడం మానేస్తే పిసిబి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతోంది కానీ ప్రస్తుత పరిస్థితులలో భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే విమర్శలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.మరి బిసిసిఐ అంతటి సాహసం చేస్తుందో లేదో వేచి చూడాలి