BCCI: బీసీసీఐ సెలక్టర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. మాజీ క్రికెటర్ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ నేతృత్వంలో ఉన్న భారత జాతీయ సెలక్షన్ కమిటీ రద్దు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. T2 0వరల్డ్ కప్ లో టీమిండియా ఘోర వైఫల్యమే దీనికి కారణంగా చెప్పవచ్చు. వీరి స్థానంలో కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బిసిసిఐ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. ఈ దరఖాస్తులను సమర్పించేందుకు నవంబర్ 28 సాయంత్రం 6 గంటలకు గడువుగా నిర్ణయించింది.
ఇప్పుడున్న సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ ప్రధాన సెలెక్టరుగా కొనసాగుతున్నాడు. వీరిలో ఏ ఒక్కరిని తమ పోస్టుల్లో కొనసాగించకుండా బీసీసీఐ పూర్తిగా సెలక్షన్ కమిటీని రద్దు చేసింది. మిగతా ముగ్గురు సెలెక్టర్లు సునీల్ జోషి (సౌత్ జోన్), హర్విందర్ సింగ్ ( సెంట్రల్ జోన్), దెబాషిష్ మహంతి ( ఈస్ట్ జోన్) ఇతర సెలెక్టర్లుగా ఉన్నారు. ప్రస్తుత తరుణంలో సెలెక్టర్లుగా చోటు దక్కించుకోవడానికి తీవ్ర పోటీ ఎదురుకానుంది.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తప్పుకున్నప్పటి నుంచి బోర్డులో, సెలెక్షన్ కమిటీలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిరుడు ఓసారి అంబటి రాయుడుని వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయ్. అదే విధంగా ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా వైఫల్యం కారణంగా సెలక్షన్ కమిటీలో రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
BCCI:
ఇప్పుడు సెలెక్షన్ కమిటీ పోస్టులకు పారదర్శకంగా ఇంటర్వ్యూలు జరుగుతాయని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జయ్ షా తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. సెలెక్షన్ కమిటీనే కాదు ఇండియన్ టీం కెప్టెన్ ను కూడా మార్చాలని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు టీం ఇండియా ఫుల్ టైం కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.