ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు మూడు కూడా కులాల ఆధారంగా విడిపోయాయి. ఈ నేపధ్యంలో ఏ పార్టీ వెనుక ఆ కులం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఎంతగా గింజుకున్న మెజారిటీ కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ వెంట నడవటానికి సిద్ధంగా ఉందని వైసీపీకి కూడా క్లారిటీ వచ్చేసింది. ఒక్క విజయనగరంలో బొత్స ఫ్యామిలీ చట్రంలోనే కాపులు అందరూ ఇరుక్కోవడం వలన ఆ జిల్లాలో కాపు ఓటింగ్ జనసేనకి అంతగా కలిసివచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే బొత్స కోటరీ నుంచి ఎవరైనా బలమైన నాయకుడు జనసేన వైపు వస్తే మాత్రం కచ్చితంగా మళ్ళీ ఓట్లు చీలుతాయి.
ఇక ఈ సామాజిక సమీకరణాలు అన్నీ మారుతూ ఉండటంతోనే వైసీపీ ఉన్న కాపు నాయకులు పవన్ కళ్యాణ్ పై తమ కోప్పాన్ని చూపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో మెజారిటీగా ఉన్న బీసీలు అలాగే ఎస్సీ, ఎస్టీలు ఎవరివైపు ఉంటే వారిదే గెలుపు అని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ ఎన్నడూ లేని విధంగా బీసీ జపం చేస్తుంది. బీసీలకి మెజారిటీ మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చామని వైసీపీ చెబుతుంది. అయితే బీసీలపై వైసీపీకి సవతితల్లి ప్రేమ పుట్టుకొచ్చింది అంటూ చంద్రబాబు నేరుగానే విమర్శలు చేస్తున్నారు.
అసలు మీరు బీసీలని ఓటు బ్యాంకు కోసం చూస్తున్నారు తప్ప వారి అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని అన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు అన్ని కూడా మింగేసి కార్పోరేషన్ లు పెట్టడం వలన ప్రయోజనం ఏముంటుంది అని అన్నారు. బీసీ రిజర్వేషన్ కూడా 24 శాతానికి వైసీపీ ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి 1200 కోట్లు మాయం చేసారని విమర్శించారు. నిధులు కేటాయించకుండా అవసరం లేని పదవులు ఇచ్చాం, పవర్ లేని మంత్రివర్గంలో స్థానం ఇచ్చాం అని చెప్పుకుంటే బీసీ ప్రజలు హర్షించే స్థితిలో లేరని చంద్రబాబు విమర్శించారు. అసలు మీరు బీసీలకి ఏం చేసారని చర్చించాలి అంటూ దయ్యబట్టారు.