సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీతో గతంలో సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున ఈసారి తన తనయుడు నాగచైతన్యతో కలిసి ఈ మూవీ సిక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ మూవీలో నాగార్జున,నాగ చైతన్య సరసన రమ్య కృష్ణ,కృతి శెట్టి వారి సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.జీ స్టూడియోస్,అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది.దీనిపై తాజాగా జీ స్టూడియోస్ స్పందించింది.
ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలు మరియు నిబంధనలను పాటిస్తూనే ఈ మూవీని థియేట్రికల్ రిలీజ్ చేస్తామని వారు స్పందించారు.