‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీతో గతంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన కింగ్ నాగార్జున అప్పట్లో బాక్స్ ఆఫీస్ బరిలో మూడు చిత్రాలు ఉన్నప్పటికీ సంక్రాంతి రేసులో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మోత మోగించి సంక్రాంతి విన్నర్ గా నిలిచారు.ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ దశలో ఉంది.ఈ మూవీని జీ స్టూడియోస్,అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో నాగార్జున,నాగ చైతన్య మెయిన్ లీడ్స్ గా కనిపించనున్నారు.రమ్య కృష్ణ,కృతి శెట్టి వారి సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.టాలీవుడ్ చిట్టి ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తుంది.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్ కు మంచి ఆదరణ లభిస్తుంది.
సంక్రాంతి రేసులో ముందుగా ఈ మూవీని రిలీజ్ చేయాలని భావించిన చిత్ర యూనిట్ బరిలో నాలుగు,ఐదు మూవీలు ఉండడంతో వెనక్కి తగ్గారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
ఈరోజు లాస్ట్ డే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మిమ్మల్ని ఆకట్టుకునే అదిరిపోయే ఒక పాట ఉందంటూ చైతూ, కృతి శెట్టి కలిసి ఉన్న ఫోటోను నాగార్జున షేర్ చేశారు.