టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో చాలా సందడిగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా RRR సినిమా హడావిడి అయితే ఈపాటికి మొదలయ్యేది. కానీ ఊహించని విధంగా కరోనా పరిస్థితుల వలన ఆ సినిమా వాయిదా పడక తప్పలేదు. ఇక ఈ సంక్రాంతికి జనవరి 14న బంగార్రాజు సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అలాగే సినిమాను చూసిన కొంతమంది సినీ ప్రముఖులు కూడా సినిమాపై చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
సంక్రాంతి సెంటిమెంట్
2016 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగార్జున కెరియర్లోనే ఆ సినిమా అత్యధిక వసూళ్లను అందుకుని మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో హిట్ అవితుందని నమ్మకంతో వస్తున్నారు.
చివరలోనే వేగంగా..
ఇక మళ్లీ ఆరేళ్ల తర్వాత సంక్రాంతి సీజన్ లో నాగార్జున అదృష్టవశాత్తు స్లాట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవి పోటీగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నాగార్జున మరోసారి కింగ్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చివరి దశలో చాలా ఫాస్ట్ గా అన్ని పనులను పూర్తిచేసి ఇటీవల సెన్సార్ పనులు కూడా పూర్తి చేశారు.
పాజిటివ్ వైబ్రేషన్స్
అక్కినేని నాగార్జున అక్కినేని నాగ చైతన్య మనం సినిమా తర్వాత కలిసి నటించిన బంగార్రాజు పై అంచనాలు అయితే మామూలుగా లేవు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయంలో ప్రస్తుతం అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి. విడుదలైన సాంగ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.
నాగచైతన్య రొమాన్స్..
ఇటీవల సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న బంగార్రాజు సినిమా చాలా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చాలా ఇష్టపడతారట. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున ఎలాగైతే సరదా సన్నివేశాలతో అలరించాడు ఈ సినిమాలో నాగచైతన్య కూడా అదే తరహాలో ఆకట్టుకుంటాట. కృతి శెట్టితో రోమాన్స్ డోస్ మామూలుగా ఉండదట. ఫస్టాఫ్ లో మొత్తం నాగచైతన్య డిఫరెంట్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.
విజువల్ ఎఫెక్ట్స్.. హైలెట్ గా..
ఇక మధ్యలో వచ్చే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి అని తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు ఉండే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలుస్తాయట. అనుకోకుండా వచ్చిన ఒక గుడి సమస్యను బంగార్రాజు ఆత్మ తో పాటు యువ బంగార్రాజు అక్కినేని నాగచైతన్య కూడా అడ్డుగా నిలుస్తారట. ఫస్టాఫ్ ఇంటర్వెల్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే సినిమాలో అనూప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో మేజర్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు.
చివరలో.. చూపు తిప్పుకోనివ్వకుండా..
చివరి క్లైమాక్స్ లో వచ్చే మరి కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయని తెలుస్తుంది. పాము కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయని, భక్తిలోనే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా జత చేసినట్లు తెలుస్తోంది ఇక శివాలయంలో జరిగే ఒక యాక్షన్ సీన్ కూడా అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు. బంగార్రాజు సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్ ని డామినేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
అసలు బంగార్రాజు సినిమా ఈ సంక్రాంతికి వస్తుందా లేదా అని మొదట్లో చాలా అనుమానాలు వచ్చాయి కానీ రాధేశ్యామ్, RRR సినిమాలు రెండూ కూడా వాయిదా పడగానే ఒక్కసారిగా బంగార్రాజు కి భారీ స్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది. దాదాపు అన్ని ఏరియాల నుంచి కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో సందడి చేయబోతున్నట్లు సమాచారం.
ALSO READ: మెగా ఫ్యామిలీ ని పట్టుకున్న అనసూయ