ట్రంప్ అపాయింట్ మెంట్ అయిన టాలీవుడ్ హీరో డేట్స్ అయిన తెగల సత్తా నాకుంది అనే బండ్ల గణేష్ వెండి తెరకు నటుడిగా పరిచియమై ఆతర్వాత నిర్మాతగా మారారు.స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.తాజాగా ఆయన లీడ్ రోల్ లో నటించిన డేగల బాబ్జీ మూవీ ట్రైలర్ ను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు.తమిళ మూవీ ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.తమిళంలో పార్తిబన్ చేసిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు.
హత్య కేసులో అనుమానితుడిగా అరెస్ట్ అయిన బండ్ల గణేష్ కథేంటి అక్కడ అతను ఏం చెప్పాడు అనేది ఈ మూవీ కథాంశంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది.ఈ మూవీలో బండ్ల గణేష్ తప్ప మిగతా పాత్రలన్నీ వాయిస్ రూపంలో వినిపించనున్నాయి.మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉందని మూవీ దర్శకుడు వెంకట్ చంద్ర తెలిపారు.
స్టేజి ఎక్కిన ప్రతిసారీ ‘ఈశ్వరా… పరమేశ్వరా’ అని స్పీచ్ ను స్టార్ట్ చేసే బండ్ల గణేష్ ఈ మూవీలో తన ఇంట్రడక్షన్ ను కూడా అదే డైలాగ్ తో స్టార్ట్ చేసారు.ఈ మూవీలో బండ్ల గణేష్ కొడుకు పాత్రకు పవన్ పేరు పెట్టారు.’బావా… నేను ఎక్కడ ఉన్నానో పట్టుకో చూద్దాం! ఎందుకు బావా ఆ దేవుడు మనల్ని పేదోళ్లుగా పుట్టించాడు. పవన్‌ని జాగ్రత్తగా చేసుకుంటావా? అంటూ మూవీలో బండ్ల గణేష్ వైఫ్ పాత్ర వాయిస్ ట్రైలర్ లో వినిపిస్తుంటుంది.ఇక బండ్ల గణేష్ అయితే తన పర్ఫార్మెన్స్ తో ‘పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టినప్పటి నుంచి మేం ఏడుస్తున్నాం’, ‘అసలు మా అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా?’ అనే డైలాగ్స్ సినీ అభిమానులను ఆకర్షిస్తున్నాడు.