Bandla Ganesh : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ రూటే సెపరేటు. ఎప్పుడు ఎలా మాట్లాడతారో.. ఎప్పుడు ఏం ట్వీట్ చేస్తారో ఆయనకైనా తెలుసో లేదో కానీ మొత్తానికి ఏదో ఒక రకంగా మాత్రం హాట్ టాపిక్ అవతూనే ఉంటారు. తాజాగా తనపై వచ్చిన రూమర్‌కి ఇంటర్వ్యూ లైవ్‌లోనే క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్. ఏ ఛానల్ అయినా సరే బండ్ల గణేష్ ఇంటర్వ్యూకి వస్తున్నారంటేనే.. ఆయన గురించిన వివరాలన్నీ తీసి దగ్గర పెట్టుకుంది. ఆయన కాస్త ఇరుకున పడ్డా కూడా అది ఓవర్‌గా వైరల్ అయిపోవడమే కాదు.. ట్రెండింగ్‌లో నిలుస్తుంది కూడా. దీంతో ఛానల్‌కు కావల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది.
ఈ కారణంగానే బండ్ల గణేష్‌ను ఇరుకున పెట్టేందుకు ఓ ఛానల్ అస్త్ర శస్త్రాలన్నింటినీ రెడీ చేసుకుంది. ఇటీవల బండ్లపై ఓ రూమర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారని ఆ రూమర్ సారాంశం. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా.. వెంటనే లైవ్‌లోనే బండ్ల ఆయనకు కాల్ చేశారు. ‘హాయ్ అనిల్ అన్న.. మీరు నాకు ఏమైనా వార్నింగ్ ఇచ్చారా’ అని అనిల్ కుమార్‌ను ప్రశ్నించారు. దీనికి అనిల్ కుమార్… ‘నేను వార్నింగ్ ఎందుకు ఇచ్చాను అన్న’ అని తిరిగి ప్రశ్నించారు. మొత్తానికి యాంకర్ షాక్స్.. బండ్లన్న రాక్స్..
Bandla Ganesh : ఆయన కనిపిస్తే చక్కగా విష్ చేస్తా..
ఆ ఇంటర్వ్యూలోనే వైఎస్సార్‌సీపీ ఎంపీకి ట్వీట్ చేసి బండ్ల కౌంటర్ ఇవ్వడంపై సైతం స్పందించారు. ఆ ఎంపీ కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడారని.. చంద్రబాబుతో ఏమైనా గొడవలుంటే వాళ్లు వాళ్లు తేల్చుకోవాలి కానీ సామాజిక వర్గాన్ని దూషించడమేంటని బండ్ల గణేష్ ప్రశ్నించారు. తనకు ఆ ఎంపీతో శత్రుత్వమేమీ లేదని.. ఆయన కనిపిస్తే చక్కగా విష్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎవరైనా సరే.. పవన్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకపై ఏపీ రాజకీయాల గురించి మాత్రం తాను మాట్లాబోనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు వచ్చి 50 ఏళ్లు అవుతుందని.. కాబట్టి ఒకరకంగా తెలంగాణయే తన స్వరాష్ట్రమని.. షాద్ నగర్ తన స్వగ్రామమని బండ్ల గణేష్ వెల్లడించారు.