Unstoppable 2 : నందమూరి బాలకృష్ణా.. మాజాకా..? మాస్ డైలాగ్ చెప్పాలన్నా ఆయనే.. ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేయాలన్నా ఆయనే.. తను గాఢ్ ఆఫ్ మాస్ అని అల్రెడీ ఈ షోలోనే ఆయన చెప్పేశారు. అలాంటి గాడ్ ఆఫ్ మాస్‌కు మాస్ కా బాస్.. మాస్ కా దాస్ జత కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? వీళ్లెవరు అంటారా? యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్. అన్‌స్టాపబుల్ 2 రెండవ ఎపిసోడ్‌కి వీరిద్దరూ అతిథులుగా హాజరయ్యారు. ఇక వీరిద్దరినీ బాలయ్య ఒక ఆట ఆడుకున్నారు.సెటైర్ల మీద సెటైర్లు వేశారు.
బాలయ్య వేసే పంచులకి విశ్వక్ అయితే.. చెమటలు పట్టిస్తున్నారు సర్ అనేశాడు.సెకండ్ ఎపిసోడ్ ప్రోమోని ‘ఆహా’తాజాగా వీడియో విడుదల చేసింది. ఎప్పటిలాగే.. బాలయ్య తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు.ఇద్దరు యంగ్ హీరోల నుంచి ఎన్నో ఆసక్తికర విషయాలను రాబట్టారు. తొలుత సిద్దు హెయిర్ స్టైల్‌పై బాలయ్య సెటైర్ వేశారు. సిద్దూ బాబుకి తల దువ్వకుండా పంపించెదవరని అడిగారు. దీనికి సిద్ధు ఇది మెస్సీ లుక్ అని చెప్పగా.. తాను మెస్సీ లుక్‌తో చేసిన సినిమాలన్నీ మెస్ అయిపోయాయని బాలయ్య సెటైర్ వేశారు.
ఇక కుర్ర హీరోల క్రష్ గురించి అడిగారు. ఆ సందర్భంగా తన కరెంట్ క్రష్ రష్మిక మందన్నా అని బాలయ్య చెప్పారు. దీంతో సిద్ధు, విశ్వక్‌సేన్ షాక్ అయ్యారు.ఇక ఈ యంగ్ హీరోల పెగ్‌ల గురించి కూడా బాలయ్య అడిగారు. కియారా అద్వానీ అంటే తనకు క్రష్ ఉందని సిద్దు చెప్పాడు. షూటింగ్ లేకపోయినా పర్వాలేదని బాలయ్య.. పంచ్‌ల మీద పంచ్‌లు పడుతూనే ఉన్నాయి. తను గొంతు విని మొహం ఎలా ఉంటుందో ఊహించుకోగలనని.. నువ్వు చందమామలా ఉంటావని బాలయ్య చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఎవరి గురించో తెలియదు కానీ ప్రోమోను మాత్రం అల్లాడించేశాయి.