Balakrishna : ఇప్పటి వరకూ యాడ్స్‌లో అత్యంత ఎక్కువగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తరువాత ఇప్పుడిప్పుడే యంగ్ టైగర్ ఎన్టీర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదితరులు మెరుస్తున్నారు. సెలబ్రిటీలకు ఇదొక అదనపు ఆదాయం. ఒక సినిమాలో నటిస్తే వచ్చే ఆదాయం దాదాపు ఒక యాడ్ నుంచి వచ్చేస్తుందంటే ఎందుకు నటించరు? మహేష్ బాబు అయితే యాడ్స్ ద్వారానే కోట్లలో డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే కొందరు హీరోలు మాత్రం యాడ్స్‌కి దూరంగా ఉంటూ వస్తున్నారు. వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు.
ఎలాంటి వ్యాపార సంస్థలకు చెందిన ప్రకటనల్లోనూ కనిపించకూడదని, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించకూడదని బాలయ్య నియమం పెట్టుకున్నారు. అయితే తాజాగా బాలయ్య దాన్ని బ్రేక్ చేశారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. బాలయ్య కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయినా సరే అదరగొట్టేశారు. ఈ యాడ్‌లో బాలయ్య అంత ఆషామాషీగా ఏమీ నటించలేదట. భారీగానే పారితోషికం అందుకున్నాడట. సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ బాలయ్యకు ఈ యాడ్‌లో నటించేందుకు ఎంత ముట్టజెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు.
తన ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్‌కు కేవలం ఒక్క యాడ్‌కే బాలయ్య తీసుకున్నారని టాక్. ఈ యాడ్ కోసం బాలయ్య ఏకంగా రూ.15 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో బీభత్సంగా ప్రచారం జరుగుతోంది. మార్కెట్‌లో బాలకృష్ణకు ఉన్న క్రేజ్ కారణంగా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి అంత భారీ మొత్తం చెల్లించక తప్పలేదట. ఇక ఈ యాడ్ చూసిన ఫ్యాన్స్ బాలయ్య అదరగొట్టేశారని చెప్పుకుంటున్నారు. కాగా.. ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ చిత్రం నిలవనుంది.