చాలా గ్రాండ్ గా 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అందుకే బిగ్ బాస్ యాజమాన్యం వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకుండానే ఈ సీజన్ ను ముగించేశారు.ఈ సీజన్ లో కంటెస్టెంట్ ల ఆటతీరు పట్ల,నాగార్జున హోస్టింగ్ పై బోలెడు విమర్శలు వచ్చాయి అయినా సీజన్ లో ఎటువంటి మార్పులు చేయకుండా పూర్తి చేశారు.ఇక సీజన్ ఫినాలేలో నాగార్జున ఈ షో మరో రెండు నెలల్లో మళ్ళీ ప్రారంభం అవుతుందని హింట్ ఇచ్చారు.ప్రస్తుతం దీనిపై నెట్టింటా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఇది బిగ్బాస్ ఆరవ సీజన్ అని కొందరు కామెంట్ చేస్తుంటే కాదు ఇది బిగ్బాస్ ఓటీటీ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే బిగ్ బాస్ ఈ కొత్త సీజన్ కు హోస్ట్ గా నాగార్జునను కాకుండా మరొకరిని తీసుకోవాలని భావిస్తుందట.దానికి సంబంధించి సంప్రదింపులు కూడా జరుపుతుందని సమాచారం.ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్న హీరో మరెవరో కాదు నందమూరి బాలయ్య.ప్రస్తుతం ఈయన ఆహలో అన్ స్టాపబుల్ షో చేస్తున్నారు.ఈ షో తుది అంకానికి చేరుకుంది.ఈ షోకు మంచి ఆదరణ దొరకడంతో ఓటిటిలో బాలయ్యకి తొలి షోనే మంచి హిట్ అయ్యింది.అందుకే ఆయనతో బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు జరుపుతుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ వైరల్ అవుతుంది.