Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 1 సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని సెకండ్ సీజన్‌లోకి అడుగు పెట్టింది. తొలి షోకే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి షాక్ ఇచ్చారు. ఎంటర్‌టైన్‌మెంట్ షోకి చంద్రబాబు ఏంటా? అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఈ ఎపిసోడ్‌కు కోట్లలో వ్యూస్ వచ్చాయి. చంద్రబాబును ప్రేమించే వాళ్లు, విమర్శించే వాళ్లు అంతా చూడటంతో రేటింగ్ రేసుగుర్రంలా దూసుకుపోయింది. మధ్యలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ కూడా జాయిన్ అయి తనపై ప్రజల్లో ఉన్న చాలా సందేహాలకు సమాధానాలిచ్చారు.
ఇక రెండవ వారం.. అతిథులుగా తొలి సినిమాతోనే అదిరిపోయిన హిట్ కొట్టిన యంగ్ హీరోలు.. సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ హాజరయ్యారు.ఇక ఈ షో అదిరిపోయింది. యంగ్ హీరోలతో తను కూడా కుర్రాడిలా మారిపోయి బాలయ్య అల్లరి చేశారు. క్రష్ నుంచి పెగ్ వరకూ అన్ని విషయాలనూ అడిగి ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. ఒకరు మాస్ కా బాస్ అని.. మరొకరు మాస్ కా దాస్ అని తాను గాడ్ ఆఫ్ మాస్ అంటూ బాలయ్య రచ్చ రచ్చ చేశారు. మొత్తానికి కుర్ర హీరోలకు బాలయ్య చెమటలు పట్టించేశారు. దాదాపు 15 లక్షల వ్యూస్‌తో ఈ ప్రోమో దూసుకెళుతోంది.
ఇక ఈ షోకి త్వరలోనే ఎవరు రాబోతున్నారో బాలయ్య హింట్ ఇచ్చేశారు. ప్రోమోలో భాగంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు బాలయ్య కాల్ చేశారు. అన్‌స్టాపబుల్‌కి ఎప్పుడు వస్తున్నావని అడిగారు. దీనికి త్రివిక్రమ్ మీరు ఓకే అంటే ఇప్పుడే వచ్చేస్తాను సర్ అన్నారు. దీనికి బాలయ్య ఎవరితో రావాలో తెలుసు కదా? అన్నారు.బాలయ్య అన్నది ఎవరి గురించో గెస్ చేశారా? మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.ఈ విషయం వినగానే మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. బాలయ్య, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపిస్తే చూడాలని అటు నందమూరి, ఇటు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.