ప్రస్తుతం యావత్ సినీ అభిమానులను భాషతో సంబంధం లేకుండా ఆర్.ఆర్.ఆర్ మూవీ తన వైపు తిప్పుకుంది.ఈ మూవీలో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్,ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్,ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా,బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్,శ్రియ కీలక పాత్రలలో కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది.ఈ ఈవెంట్ కు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించారు,బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారయ్యారు.ఈ ఈవెంట్ లో సల్మాన్ ఎన్టీఆర్,చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరో అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ నిర్వహించనుంది.దీనికి టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలయ్య,మెగాస్టార్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది.దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.