Balakrishna : నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడంటూ ఎప్పటి నుంచో ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత మోక్షజ్ఞకు బరువు తగ్గాలని దర్శకులు సూచించారు కాబట్టి బరువు తగ్గేందుకు కొంత సమయం కావాలని ఆ మధ్య టాక్ నడిచింది. మొత్తానికి మోక్షజ్ఞ ట్రాన్స్‌ఫార్మింగ్ చూస్తుంటే ఇక హీరో రెడీ అయిపోయినట్టే అనిపించింది. కానీ ఎక్కడ? ఒక్క సినిమా ప్రకటన కూడా రాలేదు. బాలయ్య కొడుకు విషయంలో ఎందుకు అంత అలక్ష్యం చేస్తున్నారనేది తెలియడం లేదు.
ఇక నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్‌కు తాజాగా ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందట. ప్రస్తుతం బాలయ్య అటు సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపై సైతం సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో అదిరిపోయే టీఆర్పీ రేటింగ్‌తో అన్‌స్టాపబుల్ గానే దూసుకుపోతోంది.
అయితే ఈ అన్‌స్టాపబుల్ షోకు తేజస్విని కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. బాలయ్య స్క్రిప్ట్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ తేజస్వినియే దగ్గరుండి చూసుకుంటోందట. అసలు అన్‌స్టాపబుల్ షో ఈ రేంజ్‌లో హిట్ అవడానికి ఆమె కృషి కూడా ఎంతో ఉందని టాక్. ఈ నేపథ్యంలోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగు కూడా పెట్టబోతున్నట్టు టాక్. అయితే నటిగా కాదులెండి. నిర్మాతగా వ్యవహించబోతోందని సమాచారం. ఇప్పటికే ఓ సినిమా స్క్రిప్ట్‌ను సైతం తేజస్విని ఓకే చేసిందట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందనేది సంబంధిత వ్యక్తులు పెదవి విప్పితేనే తెలిసే అవకాశం ఉంది.