Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన ఇప్పటికే వంద సినిమాలకు పైగా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఈయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ హిందూపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇకపోతేవచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావాలన్న ఉద్దేశంతో ఇప్పటినుంచే ప్రజలలోకి వెళ్తూ తమ పార్టీని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు.ఇప్పటికే పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన చేపట్టే దిశగా తెలుగుదేశం పార్టీ నేతలు కృషి చేస్తున్నారు.ఈ క్రమంలోనే నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారికి సరికొత్త బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
సినీ నటుడుగా బాలకృష్ణకు రాయలసీమలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇదే అదునుగా భావించిన చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు సరికొత్త బాధ్యతలను అప్పజెప్పారు. రాయలసీమలో కంచుకోటగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని కనుక ఓడిస్తే తెలుగుదేశం పార్టీ సగం విజయం అందుకున్నట్లేనని భావించిన చంద్రబాబు నాయుడు రాయలసీమలో పార్టీ తరఫున ప్రచారం చేసి రాయలసీమలో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యతలను బాలకృష్ణకు అప్ప చెప్పినట్లు తెలుస్తోంది.
Balakrishna: రాజకీయాలలో బిజీ కానున్న బాలయ్య..
తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణకు ఈ విధమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పడంతో ఈయన పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం దృష్టి పెట్టడంతో ఈయన సినిమాలు చేయడం ఇక కష్టమవుతుందని అభిమానులు భావిస్తున్నారు.ఎన్నికలు పూర్తయ్యే వరకు బాలకృష్ణ ఎక్కువ భాగం పార్టీ కోసమే కష్టపడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సినిమాలకు సమయం కేటాయించే అవకాశం ఉండదని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నారు.ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఈయన పూర్తిగా పార్టీ వ్యవహారాలతో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.