నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య బాబు సినిమా తెరకెక్కుతుంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ మూవీలో బాలయ్యకి జోడీగా నయనతారని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆమె రెమ్యునరేషన్ దగ్గర చర్చలు నడుస్తున్నాయి. బాలయ్య కచ్చితంగా నయనతారని హీరోయిన్ గా ఖరారు చేయమని చెప్పినట్లు తెలుస్తుంది. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీని తర్వాత బాలయ్య స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.
అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ కూడా వినిపిస్తుంది.కేజీఎఫ్ సిరీస్ తో ఫేమస్ అయినా రవి బాసూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. ఇక భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ కొరటాల తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. తారక్ తో సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య బాబుతో కొరటాల సినిమా ఉంటుందని సమాచారం. ఇక యూనివర్శల్ సబ్జెక్ట్ లోనే పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీ ఉండే అవకాశం ఉందని టాక్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ ఏడాది ఆఖరులో సినిమా రిలీజ్ చేయడానికి గోపిచంద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే షూటింగ్ ని చివరి దశకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తూ ఉండగా, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చాలా కాలం తర్వాత ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.