Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇటీవల మూవీలతో బిజీ అయ్యారు. అఖండ సినిమా హిట్ కొట్టాక జోరు పెంచిన బాలయ్య.. ఆ తర్వాత వరుసగా సినిమాలతో హంగామా చేస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో సినిమా షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. మరోవైపు ఇంకో మూవీ కూడా అనిల్ రావిపూడితో తీయబోతున్నట్లు బాలయ్య కన్ఫం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్టులు అలా ఉండగానే మరో ప్రాజెక్టును బాలయ్య ప్రకటించారు.
సాధారణంగా బాలయ్య కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తుంటారు. సినిమా రిజల్ట్ సంగతి పక్కనబెట్టి బాలయ్య ఎప్పుడూ ప్రయోగాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. గతంలో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. వీటిలో ఓ అద్భుత చిత్రం ఆదిత్య 369. ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారతీయ చిత్రసీమలో అప్పట్లో ఓ సంచలనమే సృష్టించింది.
దీనికి ఎప్పటి నుంచో సీక్వెల్ ఆలోచన చేస్తున్నారు బాలయ్య. అనేక కథనాలు కూడా వెలువడ్డాయి. దాంతో పాటు ఈ మూవీకి స్వయంగా బాలకృష్ణ డైరెక్షన్ చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. దీనిపై తాజాగా వచ్చిన ఓ క్లారిటీ.. మూవీ కన్ఫంగా రాబోతోందనే సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
Balakrishna:
ఆదిత్య 369 మూవీకి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ ను కూడా ఖాయం చేసినట్లు స్వయంగా బాలయ్య వెల్లడించడం విశేషం. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోలో బాలయ్యహోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో బాలకృష్ణ ఈ విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. సినిమా ఎలా ఉంటుందో అంటూ ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ అవుతోంది.