బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడవసారి బాలయ్య చేస్తున్న మూవీ అఖండ తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ మూవీలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.దాని ప్రకారం ఈ మూవీ నైజం రైట్స్ ను తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ సుమారు 19 కోట్లకు కొనగొలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న అఖండ మూవీ సింహా,లెజెండ్ తరహాలో సూపర్ హిట్ ను అందుకొని బాలయ్యకు మరుపురాని మరో హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.