Balakrishna నందమూరి బాలయ్య ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒక సమయంలో వరుస పరాజయాలతో సతమతమైన ఆయనకు ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఆ సినిమా అనుకున్న దానికంటే ఎన్నోరెట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద బాలయ్య సత్తా ఏంటో చూపింది. కరోనా తర్వాత ప్రేక్షకుల్లేక వెలవెలపోతున్న థియేటర్లకు ‘అఖండ’తో వసూళ్ల జాతర చూపించాడు బాలయ్య. మంచి సినిమా తీస్తే వస్తామని నిరూపిస్తే ఆడియెన్స్ ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్లకు క్యూలు కట్టారు.
‘అఖండ’ సక్సెస్ తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టిన బాలయ్య.. ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోతో తన పాపులారిటీని మరింతగా పెంచుకున్నారు. ముఖ్యంగా ఈతరం యువతకు ఆయన బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇదే దూకుడును ప్రదర్శిస్తూ తన తర్వాతి ప్రాజెక్టును వేగంగా ఫినిష్ చేసే పనిలో బాలయ్య ఉన్నారు. ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘వీర సింహారెడ్డి’లో బాలయ్య నటిస్తున్నారు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోందని తెలుస్తోంది.
‘వీర సింహారెడ్డి’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, టైటిల్ లుక్ లాంటివి ప్రేక్షకుల్లో చిత్రంపై మరింత బజ్‌ను పెంచాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్య కనిపిస్తున్న తీరుకు ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలాఉంటే.. తన తర్వాతి సినిమాను అనిల్ రావిపూడితో చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘రామారావు గారు’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో వయసు మళ్లిన పాత్రలో బాలయ్య కనిపించనున్నారని సమాచారం.
Balakrishna రకుల్‌ను కాదని సోనాక్షీని తీసుకుంటున్నారా?
అనిల్ రావిపూడి తీయనున్న చిత్రంలో బాలయ్య సరసన ఎవరు నటిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హాను టాలీవుడ్‌కు తీసుకొస్తున్నారని వినికిడి. ముందు రకుల్ ప్రీత్ సింగ్‌ను అనుకున్నారట. కానీ సోనాక్షీని ఫైనలైజ్ చేశారని సమాచారం. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.