ఇండస్ట్రీలో యాటిట్యూడ్ కారణంగా ట్యాలెంట్ ఉన్నప్పటికీ వారిని దర్శనిర్మాతలు దూరం పెడుతారు.దీంతో అవకాశాలు అందుకోలేక వారు క్రమంగా కనుమరుగు అయిపోతారు.ఇలా ఇండస్ట్రీ దూరం పెట్టిన వారిలో జమున,వాణిశ్రీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న నయనతార,ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన స్నేహ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది.అయితే వీరివురికి గతంలో బాలయ్య బాబు నోటీస్ లు పంపారు మరి దానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.గతంలో వరద బాధితుల సహాయార్థం బాలయ్య ఈవెంట్ కన్వీనర్‌గా మారారు.అప్పుడు అయిన స్టార్ నైట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరూ హాజరవ్వాలని అలా కానీ పక్షంలో వారు వివరణ ఇవ్వాలని బాలయ్య అందరికీ నోటీసులు పంపారు.ఈ నోటీసులు పై స్నేహ,నయనతార స్పందించలేదు అలాగే బాలయ్య నిర్వహించిన షోకు హాజరు కాలేదు.దీంతో ఆగ్రహించిన బాలయ్య వారిని బ్యాన్ చేసినట్టు సమాచారం.