Balakrishna: నందమూరి చందమామ బాలకృష్ణ జోరు మాములుగా లేదు. ఆయన సినిమాలు మంచి వసూళ్ళు రాబడుతున్నాయి. ఆయన వ్యాఖ్యాతగా వహిస్తున్న Unstoppable with NBK(అన్‌స్టాపబుల్ షో ) కూడా రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. సినిమాలు,షోలు మాత్రమే కాదు,ఎమ్మెల్యే గా హిందూపూర్ నియోజకవర్గ విషయాలు,తను నడుపుతున్న బపవ తారకం కాన్సర్ హాస్పిటల్ పనులతో బాలయ్య బాబు ఫుల్ బిజీగా ఉన్నారు.
మిగతా హీరోలతో పోలిస్తే,బాలయ్య బాబు ఇప్పటివరకూ కమర్షియల్ యాడ్స్ చేయలేదు. ఎన్నోపెద్ద కంపెనీలు పెద్ద పారితోషకాలు ఇస్తామన్నా బాలయ్య టెంప్ట్ కాలేదు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నడూ లేనిది బాలయ్య బాబు కమర్షియల్ యాడ్స్ చేయడానికి తన అంగీకారాన్ని తెలిపారు. ఇప్పుడు దీని మీదే పెద్ద చర్చ నడుస్తుంది.
మీడియా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ ఒక యాడ్ లో తళుక్కున మెరిశారు. శ్రీ ప్రియ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ఒక యాడ్ లో బాలకృష్ణ నటించారట. ఈ యాడ్ మంచిగా వచ్చినట్టు బయట చెప్పుకుంటున్నారు. పెద్ద పండగ అయిన దీపావళి సందర్భంగా ఈ యాడ్ ని ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది బాలయ్య మొదటి యాడ్ కాబట్టి,ఆయన ఇందులో ఎలా కనిపించబోతున్నారు అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.
Balakrishna:
బాలయ్య బాబు యాడ్స్ లో నటించకూడదని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ ని ప్రకటనల్లో నటించి పాడు చేసుకోకూడదు అనేది ఆయన భావనగా ఉండేది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అభిమానులు యాడ్స్ లో నటించి జనాలకు మరింత చేరువగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అభిమానుల హీరో గా పేరున్న నందమూరి హీరో తన రూల్ ని బ్రేక్ చేసి ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.