నందమూరి బాలకృష్ణ ఈ మధ్య యంగ్ టాలెంటడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య దీనిని త్వరలో పూర్తి చేయబోతున్నాడు. శృతి హాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ టైటిల్ ని దీపావళికి ఎనౌన్స్ చేయబోతున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ కంటెంట్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరిద్దరి కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ దీని తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. మరి ఇది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది తెలియదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ నెక్స్ట్ సినిమా దర్శకుల జాబితాలోకి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వచ్చి చేరాడు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2కి ఇతడే దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఇంటరెస్టింగ్ ప్రోమో, ట్రైలర్స్ తో అన్ స్టాపబుల్ 2కి జనాల్లోకి బాగా తీసుకెళ్లాడు. ప్రశాంత్ వర్మ మేకింగ్ స్టైల్ బాలయ్యకి నచ్చడంతో సినిమా చేద్దామని అతనికి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ప్రశాంత్ వర్మ తన దగ్గర ఉన్న థ్రిల్లర్ కథలని బాలయ్యకి చెప్పాడని అందులో ఒక కథ అతనికి బాగా నచ్చిందని టాక్. ఈ నేపధ్యంలో ఆ కథ మీద వర్క్ చేయమని సూచించినట్లు తెలుస్తుంది. ఇంటరెస్టింగ్ హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్ తో బాలయ్య ఒకే చేసిన కథ ఉంటుందని సమాచారం. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తేజ సజ్జాని హీరోగా పెట్టి హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. విజువల్ ట్రీట్ గా లిమిటెడ్ బడ్జెట్ తోనే ఈ మూవీని ప్రశాంత్ వర్మ ఆవిష్కరిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత బాలయ్యతో అనుకున్న కథని పూర్తిగా సిద్ధం చేసే పనిలో ప్రశాంత్ వర్మ దృష్టిపెట్టబోతున్నట్లు తెలుస్తుంది.