అఖండ మూవీతో తాజాగా హిట్ ట్రాక్ ఎక్కిన బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గా పేరున్న గోపీచంద్ మలినేనితో ఓ చిత్రం చేయనున్నారు.బాలకృష్ణ కెరియర్ లో 107వ చిత్రంగా తెరకెక్కే ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా కనిపించబోతున్నారు.ఈ మూవీలో బాలయ్య సరసన శృతహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు.తాజాగా ఈ మూవీ లోని కీలక పాత్ర కోసం దర్శకుడు కన్నడలో మంచి పాపులారిటి ఉన్న దునియా విజయ్ ను తీసుకున్నారు.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.
క్రాక్ మూవీతో సూపర్ హిట్ ను అందుకున్న గోపీచంద్ మలినేని అఖండ మూవీ హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య కలిసి సినిమా చేస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని సమాచారం.