తాజాగా సర్జరీ చేయించుకున్న బాలయ్య వచ్చే నెల డిసెంబర్ నుండి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న తన తదుపరి మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.ఈ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు.అందులో ఒక పాత్ర కథ మొత్తం యు.ఎస్ లో ఉండబోతుంది.ఇందుకోసం చిత్ర యూనిట్ వచ్చే ఏడాది యు.ఎస్ కు వెళ్ళబోతున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలయ్య సరసన కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం ఈ మూవీకి జై బాలయ్య అనే టైటిల్ ను నామకరణం చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.మాస్ డైరెక్టర్ గా పేరున్న గోపీచంద్ మలినేని బాలయ్యను ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.