అఖండ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గా పేరున్న గోపీచంద్ మలినేనితో ఓ చిత్రం చేయనున్నారు.బాలకృష్ణ కెరియర్ లో 107వ చిత్రంగా తెరకెక్కే ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా కనిపించబోతున్నారు.ఈ మూవీలో బాలయ్య సరసన శృతహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు.తాజాగా ఈ మూవీలోని కీలక పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకున్నారు.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ మూవీలో కీలక పాత్రలో కనిపించి మెప్పించిన ఈమె ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం